15న ఇన్‌చార్జి మంత్రి సీతక్క పర్యటన | - | Sakshi
Sakshi News home page

15న ఇన్‌చార్జి మంత్రి సీతక్క పర్యటన

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఈనెల 15వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పా ల్గొని మధ్యాహ్నం 2.30గంటలకు జిల్లాకు చేరుకుంటారు. కమ్మర్‌పల్లి మండలం నాగా పూర్‌ గ్రామంలో గ్రామపంచాయతీ భవనా న్ని ప్రారంభిస్తారు. మోర్తాడ్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. కార్యక్రమాల అనంతరం ములుగుకు తిరిగి బయల్దేరుతారు.

మెడికల్‌ కళాశాలకు మరో 30 సీట్లు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) మరో 30 సీట్లను కేటాయించింది. కళాశాలలో 150 మె డికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో 100 సీట్లతో మెడికల్‌ కళాశాల ప్రారంభం కాగా, 2019లో ఈడబ్ల్యూఎస్‌ కోట కింద 20 సీట్లను కేటాయించారు. ప్ర స్తుత 30 సీట్లను కేటాయించారు. ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలో 81 ీపీజీ సీట్లు ఉన్నాయి. అదనపు సీట్లు కేటాయించడంపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణమోహన్‌ హర్షం వ్యక్తం చేశారు.

నేత్రాలయానికి

ఆరు ఎకరాల భూమి

నందిపేట్‌ (ఆర్మూర్‌): మండల కేంద్రంలోని పలుగు గుట్ట ప్రాంతంలో నేత్రాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఎకరాల భూమిని కేటాయించినట్లు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి తెలిపారు. భూమి కేటాయింపునకు కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు సుదర్శన్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కే దారానంద స్వామి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేదారేశ్వర ఆశ్రమానికి తమ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభు త్వం నుంచి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వినయ్‌కుమార్‌రెడ్డి, ఆశ్రమ కమిటీ సభ్యులు సాయికృష్ణారెడ్డి, సంజీవ్‌, లక్ష్మణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరు వారాల్లో 1784 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా గడిచిన ఆరు వారాల్లో 1784 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.కోటీ 45 లక్షల ఇరవై వేల రూపాయల జరిమాను విధించినట్లు వివరించారు. అలాగే 124 మందికి న్యాయస్థానాలు జైలు శిక్ష, మిగతా వారికి జరిమానా విధించాయని తెలిపారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు వివరించారు.

సబ్‌స్టేషన్‌ ముట్టడి

డిచ్‌పల్లి: విద్యుత్‌ సరఫరాలో కోతలను నిరసిస్తూ మండలంలోని మెంట్రాజ్‌పల్లి, నాకా తండా, వెస్లీ తండా గ్రామాలకు చెందిన రైతులు శనివారం 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వరి పొట్ట దశలో ఉందని, విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం కారణంగా పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు కనీసం 14 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని రైతుల డిమాండ్‌ చే శారు. వారం రోజులుగా కేవలం నాలుగైదు గంటలు విద్యుత్‌ సరఫరా ఇస్తుండడంతో పంటలకు సాగునీరందడం లేదన్నారు. ఎస్సై ఎండీ ఆరిఫ్‌ ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సబ్‌ స్టేషన్‌లో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో చర్చించారు. ఇకనుంచి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement