వర్షం..హర్షం | - | Sakshi
Sakshi News home page

వర్షం..హర్షం

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

జిల్లా వ్యాప్తంగా కురిసిన వాన

నేడు భారీ వర్షం కురిసే అవకాశం

నగరంలోని కోర్టు చౌరస్తాలో

రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా శనివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. మేఘావృతమై పలు చోట్ల భారీ వర్షం, కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎడపల్లిలో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నందిపేట్‌, నిజామాబాద్‌, డొంకేశ్వర్‌, డిచ్‌పల్లి, సాలూర, మోస్రా, ఇందల్వాయి, బోధన్‌, ఆర్మూర్‌, ఆలూర్‌, ముప్కాల్‌ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దాదాపు నెలన్నర తర్వాత వర్షం కురవడంతో వరి పంటలకు మేలు చేకూర్చినట్లయ్యింది. కాగా, ఆదివారం భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement