మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి భూమిపూజ

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్‌ ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు సెల్‌ఫోన్‌ దొంగ అరెస్ట్‌

బోధన్‌: ఎడపల్లి మండలంలోని జానకంపేటలో శనివారం మార్కండేయ మందిరం పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మందిర పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి భక్తులు మరింత సౌకర్యంగా అందుబాటులోకి తీసుకువస్తామని మందిరం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చిలుక వినో ద్‌ కుమార్‌ తెలిపారు. గ్రామస్తులు విఠల్‌, చిలుక నారాయణ, ప్రవీణ్‌, లక్ష్మణ్‌, మల్లేశ్‌, నగేశ్‌, అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు విద్యుత్‌

స్తంభాల ఏర్పాటు

వేల్పూర్‌: మండల కేంద్రంలో అంబేడ్కర్‌ వి గ్రహం సమీపంలో ప్రధా న రహదారిపై విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ఎత్తయిన విద్యుత్‌ స్తంభాలను ట్రాన్స్‌కో సిబ్బంది శనివారం ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా విద్యుత్‌ స్తంభాలు తక్కువ ఎత్తువి ఉండడంతో వినాయక విగ్రహాలు తెచ్చినప్పుడు, నిమజ్జనానికి తరలించిననప్పుడు, భారీ వాహనాలు వెళ్లినప్పుడు వైర్లు తాకుతున్నాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఎత్తయిన విద్యుత్తు స్తంభాలను అమర్చారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి సీతక్కను కలిసిన

సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు

కమ్మర్‌పల్లి: మంత్రి సీతక్కను జిల్లా సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో కలిశారు. తాము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రికి వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం సన్మానించారు. సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు రాజు, జన్ము జనార్దన్‌, బేల్దారి నవీన్‌, మునిపల్లి సాయి రెడ్డి, అరిగెల జనార్దన్‌ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

బోధన్‌: ఎడపల్లి మండలం జానకంపేటలో ఈ నెల 8న రాత్రి సమయంలో కిరాణ దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్టు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ శనివారం తెలిపారు. వివరాలు.. జానకంపేటకు చెందిన పూలపల్లి వీరేశం తన కిరాణ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.7 వేలు నగదు దొంగలించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గద్ద గంగారాం అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించాడని ఎస్సై తెలిపారు. ఆయన నుంచి రూ.1500 స్వాధీనం చేసుకుని బోధన్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపించినట్టు పేర్కొన్నారు.

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో యూనియన్‌ బ్యాంకు దగ్గర ఒక గదిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్సై శైలేందర్‌ తెలిపారు. వారి నుంచి రూ. 3,460, నాలుగు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ఈ నెల 7న సెల్‌ఫోన్‌ దొంగతనం చేసిన బాలుడిని శనివారం అరెస్ట్‌ చేసి జువైనల్‌ కోర్టుకు తరలించినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన బండ రాహుల్‌ జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. జగిత్యాల కొత్తబస్టాండ్‌లో ఈనెల 7న ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా సెల్‌ఫోన్‌ దొంగిలించారు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం హిందూపూర్‌కు చెందిన బాలుడిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని జువైనల్‌ కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement