ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలి

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

బోధన్‌: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనం అలవర్చుకోవాలని మహారాష్ట్ర ప్రాంత తమ్లూర్‌ మఠాధిపతి షటస్థల బ్రహ్మ 108 శ్రీ శివానంద శివాచార్య మహారాజ్‌ ప్రబోధించారు. పట్టణ కేంద్రంలోని జంగం గల్లీలో గల పురాతన చారిత్రిక పురాణే మఠం నిర్వాహకులు పురాణే అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శ్రావణ మాస ఉద్దీపన ముగింపు కార్యక్రమాన్నిఅత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురాణే మఠం నిర్వాహకులు 18 ఏళ్లుగా శ్రావణ మాసంలో నెల రోజుల పాటు తమ శిష్యుల ఇళ్లలో వీరశైవ సంప్రదాయం ప్రకారం శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్దీపన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన మఠాధిపతి భక్తులనుద్దేశించి ప్రవచనాలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. వీరశైవుల గురువు సుంకిని గ్రామానికి చెందిన సిద్ధిలింగప్ప మహారాజ్‌, సంతోష్‌ మహారాజ్‌, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement