బాల్కొండ అభివృద్ధికి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

బాల్కొండ అభివృద్ధికి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

బాల్కొండ అభివృద్ధికి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు రూ. 250 కోట్ల నిధుల ప్రతిపాదనలను నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌ కుమార్‌ శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. హైదరాబాద్‌లో మంత్రిని కలిసి అభివృద్ధి పనుల గురించి వివరించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని మంత్రిని కోరారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రహదారులను బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సునీల్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement