ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 2,615 కేసులు పరిష్కారం అయ్యాయి. లోక్ అదాలత్‌లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ కేసులను పరిశీలించారు.
బోధన్‌లో 483 కేసులు..
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 483 కేసులు పరిష్కారం కాగా రూ. 32 లక్షల 99 వేలు ఆదాయం సమకూరింది. ఈ లోక్ ఆదాలత్‌లో ఐదవ అదనపు న్యాయమూర్తి, బోధన్ మండల సేవా కమిటీ చైర్‌పర్సన్ వరూధిని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కాంచన రెడ్డి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మర్కల్ పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జీ సాయి శివ హాజరయ్యారు.


