ఆర్మూర్ సీపీఎం కార్యాలయంలో సీతారాం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు
నవీపేటలో..
డిచ్‌పల్లి: మండలంలోని దూస్‌గాం గ్రామంలోగల శివాలయం గుట్టపై చిరుత కోసం శనివారం అటవీ సిబ్బంది గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టారు. ఈసందర్భంగా సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్ మాట్లాడుతూ.. డీఎఫ్‌వో ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించినట్లు తెలిపారు. గుట్టపై చిరుత పాదముద్రలు కనిపించకపోవడంతో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదట గ్రామస్తులు పంపిన ఫోటో ఏఐ జనరేటెడ్ కావడంతో పట్టించుకోని అటవీ శాఖ ఉన్నతాధికారులు.. ఫోన్‌లో ఫొటో కరెక్టేనని నిర్ధారించారు. గత ఐదు రోజుల్లో చిరుత రెండు మేకలపై దాడి చేసి చంపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతులు పంట పొలాల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. గాలింపు చర్యల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ శశిధర్, హరీష్, సురేష్, బేస్ క్యాంపు సిబ్బంది రవి, సర్పంచ్ సువర్ణ వెంకట్, ఉప సర్పంచ్ మురళి, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ రేంజ్ పరిధిలో చిరుత సంచారం
సిరికొండ: సిరికొండ రేంజ్ పరిధిలోని మహిపాల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తండావాసులకు చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిప్యూటీ రేంజర్ గంగారం తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి అవి చిరుత పాదముద్రలుగా గుర్తించారు. అనంతరం ఆయన స్థానికులకు అవగాహన కల్పిస్తూ చిరుతను చంపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టవద్దని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


