సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో గతేడా ది కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఆగ స్టు 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపా తం నమోదైంది. ఆ మూడు రోజుల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా సరాసరిన 40 సెం.మీ. వర్షం కురిసింది. వరదలతో రోడ్లు, చెరువులు, వంతెనలకు భారీ న ష్టం వాటిల్లింది. వాటిని పునర్నిర్మించేందుకు రూ.251.36 కోట్లు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కాగా వరదలు, వ ర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,454 ఇళ్లు దెబ్బతిన్నాయి. 118 పశువు లు, 53,270 కోళ్లు మృత్యువాతపడ్డాయి. 334 గ్రా మాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో వివిధ పంటలు, 140 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 స్తంభాలు, 51.84 కిలోమీటర్ల వైర్లు, 589 ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం వాటిల్లింది.
50,028 ఎకరాల్లో పంటలకు నష్టం
జిల్లాలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట కొట్టుకుపోవడం, ఇసుక మేటలు వేయడం, నీట మునిగి దెబ్బతినడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పంచాయతీరాజ్ శాఖకు రూ. 45.50 కోట్లు...
పంచాయతీరాజ్ కామారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులకు రూ.37.50 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు.
నీటిపారుదల రంగానికి రూ.41 కోట్లు...
వాగులు పొంగి ప్రవహించడంతో 157 చెరువులు దెబ్బతిన్నాయి. వందేళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని ఓ దశలో అధికారులు ఆందోళన చెందారు. కట్ట కొంత కోతకు గురవగా తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ల కట్టలు కొ ట్టుకుపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంది. చెరువులు చాలా చోట్ల గండ్లు పడ్డాయి. కాలువలు కూడా కొట్టుకుపోయాయి. వరదల కారణంగా నీటిపారుదల రంగానికి రూ. 41 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.125.50 కోట్లు..
జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 65 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా, 48 కల్వర్టులు పాడయ్యాయి. వాటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5.50 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఉన్న కల్వర్టు వరదలో కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.
నీట మునిగిన కాలనీలు...
గతేడాది 26న రాత్రి ప్రారంభమైన వర్షం 27, 28 తేదీలలో ఉగ్రరూపం దాల్చి ప్రళయాన్ని సృష్టించింది. జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీ, దేవి విహార్, టీచర్స్ కాలనీ, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జీఆర్ కాలనీ మొత్తం నీట మునిగిపోవడంతో వందలాది మంది ఇబ్బందిపడ్డారు. వారిని అధికారులు బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లలోని వస్తువులు తడిసిపోయాయి. కార్లు, బైక్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మహ్మద్‌నగర్, ఎల్లారెడ్డి, లింగంపేట తదితర మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
కామారెడ్డిని ముంచెత్తిన
భారీ వరదలకు ఏడాది
వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
ఓదార్పే తప్ప అందని సాయం
మరమ్మతులకు నోచుకోని
రోడ్లు, వంతెనలు
ఇప్పటికీ కోలుకోని జిల్లా


