నిజామాబాద్ రూరల్: ప్రజలంతా కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గంగా, జమునా, తహజీబ్ సంస్కృతి ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్‌లో బుధవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు, ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య ఐక్యతే తెలంగాణ బలం అని అన్నారు. మని షిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టా ల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని పి లుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ సెక్యు లర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని పే ర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అఽ ద్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, శేఖ ర్‌గౌడ్, నరాల రత్నాకర్, జావిద్ అక్రమ్, ఖుద్దూస్, హారున్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందన్, అన్వర్, మొహమ్మద్ అహ్మద్, కో ఆప్షన్ మెంబర్ మహేందర్ సింగ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరించాలి
మైనార్టీల సంక్షేమానికి
ప్రభుత్వం కట్టుబడి ఉంది
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
మహేశ్‌కుమార్ గౌడ్,
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ


