● మొక్కలు నాటి సంరక్షించాలి
● టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
● మల్లారం గండిలో వన మహోత్సవం
నిజామాబాద్ రూరల్: పర్యావరణ పరిరక్షణను ప్ర తి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని.. మొక్క లు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మండలంలోని మల్లారం గండి ప్రాంతంలో గురువారం వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ నాయకులు, ఫారెస్ట్ అధికారుతో కలసి మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనమహోత్సవాన్ని అధికారులు విజయవంతం చేయాలన్నా రు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ వనమహోత్సవంలో పాలొని తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ శేఖర్‌గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


