దోమకొండ: ప్రతి కుటుంబం అదనపు అదాయం పొందేలా చూడాలని జిల్లా అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సీనియర్ సీఆర్పీలకు శిక్షణ తరగతులు నిర్వహించి మాట్లాడారు. మండలంలోని 15 గ్రామ సంఘాలు, మహిళ సభ్యులకు, కరీంనగర్ నుంచి వచ్చిన సీనియర్ సీఆర్పీలు లత, రూప శిక్షణ ఇచ్చారు. సంఘాల నిర్వహణ, సంఘ సభ్యులకు కావలసిన మౌలిక సదుపాయాలు, ప్రతి కుటుంబానికి అదనపు ఆదాయం పొందడం, తక్కువ వడ్డీ రేట్ల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమానికి జిల్లా ఐబీ డీపీఏం శ్రీనివాస్, ఎంఎస్ అధ్యక్షురాలు భూలక్ష్మి, ఇన్‌చార్జి ఏపీఎం వెంకట్, రాజా గౌడ్, వీవోఏలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


