18 ఏళ్లలోపు పిల్లలకు సిగరెట్, గుట్కా, మ ద్యం నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించొద్దని మోపా ల్ మండలంలోని మంచిప్ప గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు కిరాణాదుకాణాలు, మద్యం షాపు వద్ద, గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 18 ఏళ్లలోపు వారు నిషేధిత మత్తుపదార్థాలు కొనుగోలు చేసినా.. వారికి విక్రయించినా రూ.10వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చినా.. రాత్రి 8గంటల తరువాత రోడ్లపై వాహనాలు నడుపుతూ పిల్లలు కనిపించినా జరిమానా విధించాలని కఠిన తీర్మానాలు చేశారు. మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ ఎవరైనా కనిపిస్తే సమాచారం అందించిన వారికి రూ.5వేల బహుమతి అందజేస్తామని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఫ్లెక్సీల్లో ముద్రించారు.
– మోపాల్ (నిజామాబాద్ రూరల్)


