నగరంలో నిరసనల హోరు | - | Sakshi
Sakshi News home page

నగరంలో నిరసనల హోరు

Aug 18 2026 8:04 AM | Updated on Aug 18 2026 8:04 AM

వేర్వేరు డిమాండ్లపై రాజకీయ, విద్యార్థిసంఘాల ఆందోళనలు

ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

వందేమాతర గీతాన్ని అవమానించారంటూ..

సుభాష్‌నగర్‌: నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం బీజేవైఎం నాయకులు వందేమాతర గీతాలాపన చేసి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వందేమాతర గీతాన్ని పాడకుండా అడ్డుకోవడం సి గ్గుచేటన్నారు. ఇందుకు నిరసనగా బీజేవైఎం పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం బీజేవైఎం నాయకులను అరెస్ట్‌ చేసి 1వ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రత్నగారి వంశీగౌడ్‌ కార్పొరేటర్లు, నాయకులు ఎర్రం సుధీర్‌, చిరంజీవి, శశాంక్‌, శ్రావణ్‌, బీజేవైఎం నాయకులు విపుల్‌, ప్రశాంత్‌, రాజశేఖర్‌, మహేష్‌, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలంటూ..

ఖలీల్‌వాడి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ నా యకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు ర్యాలీ గా వెళ్లి, జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలోగల పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఇంటిని ముట్టడించారు. పీసీసీ చీఫ్‌ ఇంటికి పీడీఎస్‌ యూ నేతలు ర్యాలీగా వెళ్లారు. పెండింగ్‌ లో ఉన్న స్కాల ర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విడుదల చే యాలన్నారు. నాలగవ టౌన్‌ పోలీసులకు సమాచారంతో వెంటనే పీసీసీ ఛీప్‌ ఇంటికి వెళ్లిన పీడీఎస్‌ యూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్‌ యూ అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అక్కడ ఉన్న విద్యార్థులను పోలీసులు చేదరగొట్టారు.

‘కల్యాణలక్ష్మి’ పునరుద్ధరించాలంటూ..

నిజామాబాద్‌ అర్బన్‌: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను వెంటనే పునరుద్ధరించాలంటూ బీఆర్‌ ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు ఎన్టీఆర్‌ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా నగర అధ్యక్షుడు సిర్ప రాజు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను నిర్వీర్యం చేసేందు కు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించా రు. మాజీ మేయర్‌ దండు నీతుకిరణ్‌ శేఖర్‌, మాజీ నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సత్య ప్రకాష్‌, నవీద్‌ ఇక్బాల్‌, అబ్దుల్‌ మతీన్‌, జగత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement