బాన్సువాడ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల కోసం మంగళవారం నుంచి నమోదు కార్యక్రమం, మార్పులు, చేర్పుల కోసం ఫారం 6,7,8 స్వీకరిస్తామని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో 1,96,331 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు సర్ 89.87 శాతం పూర్తయిందని, డ్రాప్ట్ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశామని అన్నారు. నియోజకవర్గంలో 19,887 ఓట్లు డిలీట్ అయ్యాయన్నారు. ఓటర్ల పేర్లు వివరాల్లో ఏమైన తప్పులు, అభ్యంతరాలుంటే సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ నరేందర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు కాసుల రోహిత్, మాసాని రవీందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు రమేష్‌యాదవ్, టీడీపీ నాయకులు శంషోద్దీన్, ఎంఐఎం నాయకులు హశం తదితరులు ఉన్నారు.


