తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సోమవారం పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 284 మంది విద్యార్థులకు గానూ 238 మంది విద్యార్థులు హాజరు కాగా.. 46 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
ఇంజినీరింగ్ పరీక్షలు..
తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ బీటెక్ సీఎస్‌ఈ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 56 మంది విద్యార్థులకు గానూ 55 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
ఖలీల్‌వాడి: జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న ఒక ఏఎన్‌ఎం పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టును ఎస్సీలకు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌తోపాటు ఏఎన్‌ఎం పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20లోపు జిల్లాకేంద్రంలోని న్యూ కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశా ఖాధికారి కార్యాలయంలోని సమగ్ర శిక్ష, రూం నెంబర్. 117లో దరఖాస్తులను సమర్పించాలన్నారు.
పెర్కిట్(ఆర్మూర్): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ సూచించారు. అంకాపూర్ భార్గవి విద్యానికేతన్ విద్యార్థులకు సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్‌లో ఆన్‌లైన్ ఆటలు ఆడడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కరస్పాండెంట్ పట్వారి గోపికృష్ణ, సామాజిక సేవకుడు పట్వారి తులసి, ప్రిన్సిపల్ ప్రగతి, విద్యార్థులు పాల్గొన్నారు.
పిట్లం : పిట్లం – బాన్సువాడ రోడ్డు మధ్యలో లారీ మెయిన్ పట్టి విరిగిపోవడంతో ఆగింది. దీంతో సుమారు మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సిద్దాపూర్ గ్రామం సమీపంలో పిట్లం – బాన్సువాడ రోడ్డుపై వర్షాలకు భారీ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కామారెడ్డి టౌన్ : హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద మంగళవారం జరిగే గీతన్న సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 2న ప్రారంభించిన గీతన్న చైతన్య యాత్ర మంగళవారం హైదరాబాద్ సభతో ముగుస్తుందన్నారు. దీంట్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్లుగీత కా ర్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవిందర్,రాజాగౌడ్,స్వామి తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం నూతన కార్యవర్గా న్ని సోమవారం ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రెడ్డి రాజయ్య, నర్సింలు,అధ్యక్షుడిగా కాగుల మో హన్ యా దవ్, ప్రధానకార్యదర్శిగా సురేందర్, ఉపాధ్యక్షుడిగా రాముపటేల్, సత్యనారాయణ, దేవాగౌడ్, కార్యదర్శిగా పల్లె నర్సింలు, సంయుక్త కార్యదర్శులుగా యాదగిరిగౌడ్, రెడ్డి స్వ ప్న, మహ్మద్ మహమూద్, నవీన్‌రావు, కోశా ధికారిగా డప్పు స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గా శంకర్‌గౌడ్‌లు ఎన్నికయ్యారు. కళాకారు ల సమస్యలను గుర్తించి సంక్షేమం,ఉపాధి అవకాశాలు,గుర్తింపుఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
మాచారెడ్డి: మండలంలోని సోమారంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాదులోని రాష్ట్రపతి భవన్ ఆవరణలో ప్రతిభ కనబరిచారు. పిరమిడ్ ఆకారం, అలాగే గ్రామ దేవత ల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్,సోమారంపేట సర్పంచ్ మమత,సోమారంపేట తండా సర్పంచ్ సునీత, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.


