సక్రమంగా నడిస్తేనే సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

సక్రమంగా నడిస్తేనే సత్ఫలితాలు

Aug 18 2026 8:04 AM | Updated on Aug 18 2026 8:04 AM

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు అప్పగించాలి

ఈ నెల 19 నుంచి 29 వరకు

కాంప్లెక్స్‌ సమావేశాలు

మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ

సిరికొండ: పాఠశాల సముదాయ సమావేశాలు సక్రమంగా జరిగితేనే విద్యారంగంలో సత్ఫలితాలు వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి, బోధన అనుభవాలు పంచుకోవడం, మెరుగైన పని తీరు కోసం ప్రతి విద్యాసంవత్సరంలో ఆరు నుంచి ఏడుసార్లు పాఠశాల సముదాయ సమావేశాలు జరుగుతాయి. ఈ విద్యా సంవత్సరం విద్యా శాఖ ముందుగానే ఎజెండా అంశాలను విడుదల చేసింది. పా ఠశాల పనితీరు నివేదిక(పీజీఐ), విద్యార్థుల ప్రొగ్రె స్‌ కార్డులు(హెచ్‌పీసీ), ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) ప్రధాన అంశాలుగా ఈనెల 19 నుంచి 29 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 33 మండలాల పరిధిలో 81 కాంప్లెక్స్‌ సముదాయ పాఠశాలల పరిధిలో సమావేశాలు కొనసాగనున్నాయి. 19, 20 తేదీల్లో ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి స మావేశాలు, 25, 27, 29 తేదీల్లో సబ్జెక్టు పరంగా కాంప్లెక్స్‌ సమా వేశాలు జరుగుతాయి.

చిన్నబడుల్లో నిర్వహించేవారేరి?

ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్‌ సమావేశాలు తమ పరిధిలో ఉన్న కాంప్లెక్స్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించే కార్యక్ర మాలైన ఎఫ్‌ఎల్‌ఎన్‌, రెమిడియేషన్‌పై వీరికి సరైన అవగాహన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో ఇటీవల ఒక్కరోజు మాత్రమే శిక్షణ ఇవ్వగా.. సరైన అవగాహన లేక సమావేశాలు తూతుమంత్రంగా సాగే అవకాశం ఉంది. కాంప్లెక్స్‌ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్‌ ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు సమావేశాల నిర్వహణ అప్పగిస్తే సత్ఫలితాలను సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తవుతోంది.

జిల్లాలో పాఠశాలలు

ప్రాథమిక 735

ప్రాథమికోన్నత 127

ఉన్నత 256

ఉపాధ్యాయులు 4,800

ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్‌ సమావేశాల నిర్వహణ బాధ్యతలు ఆ కాంప్లెక్స్‌ పరిధిలోని సీనియర్‌ ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు అప్పగించాలి. దీని వల్ల కాంప్లెక్స్‌ సమావేశాల నిర్వహణ ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధితోపాటు తమ అనుభవాలను పంచుకుంటారు.

– దేవదాస్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement