● డీఎంహెచ్‌వో రాజశ్రీ
● నగరంలో రాష్ట్రీయ బాలస్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష
సుభాష్‌నగర్: జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మొబైల్ హెల్త్ టీమ్‌లు ఆరునెలలకోసారి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేయాల న్నారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం రాష్ట్రీయ బాలస్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. మొ బైల్ హెల్త్ టీమ్‌లో ఉన్న సభ్యులందరికీ వైద్యాధికారి టీమ్ లీడర్‌గా వ్యవహరించాలన్నారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను జీజీహెచ్‌లోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్షన్ సెంటర్‌కు రిఫర్ చేయాలన్నారు. వి ద్యార్థులను ఏఎన్‌ఎంలు, ఆశాలు, పీహెచ్‌సీ వై ద్యా ధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఏ వ్యాధితో ఏ విద్యార్థి బాధపడుతున్నారో రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. అనుమానిత క్యాన్స ర్ కేసులను క్యాన్సర్ కేర్ సెంటర్‌కు రిఫర్ చేయా లని తెలిపారు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడితే వారిని గుర్తించి డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్‌ఆఫీసర్‌కు, 14416 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారమివ్వాలని సూచించారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సికందర్ నాయక్, విద్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


