సార్‌ రాకుంటే స్కూల్‌ బందే! | - | Sakshi
Sakshi News home page

సార్‌ రాకుంటే స్కూల్‌ బందే!

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

సెలవు పెడితే సమాచారం ఇవ్వాలి

ప్రాథమికస్థాయి విద్యపై ప్రభావం

జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 71

కుంటుపడుతున్న ప్రాథమిక విద్య

ఆందోళనలో తల్లిదండ్రులు

ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యానికి టీచర్ల కొరత అడ్డంకిగా మారుతోంది. జిల్లాలో 71 ప్రభుత్వ ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలలు ఏకోపాధ్యాయులతో న డుస్తున్నాయి. ఒకే టీచర్‌ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలు, వి ద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, మధ్యాహ్న భోజన పథకం తదితర వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు కనీసం రాయడం, చదవడం, అక్షరాలు గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్న ఒక ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా.. శాఖాపరమైన శిక్షణ కార్యక్రమాలకు వెళ్లినా విద్యార్ధులకు ఆ రోజు సెలవే!

విధులకు హాజరైన ఉపాధ్యాయుడు ఒక తరగతికి పాఠం చెబుతున్నప్పుడు మిగతా నాలుగు తరగతుల విద్యార్థులు వారికి వారే పాఠాలు చదువుకుంటున్నారు. బోధన కన్నా విద్యార్థులను పర్యవేక్షించేందుకే ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుందని టీచర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు బోధనతోపాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల బాధ్యతలు అప్పగిస్తున్నారు.

విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..

ప్రభుత్వ పాఠశాలలోపై తల్లిదండ్రులకు విశ్వాసం పెరగడంతో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే మరోవైపు పాఠశాల్లో టీచర్ల సంఖ్య సరిపడా లేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒకే ఉపాధ్యాయుడితో విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

ఏకోపాధ్యాయులు సెలవు పెడితే ఎంఈవో, స్కూ ల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు తప్పనిసరిగా సమాచా రం ఇవ్వాలి. వెంటనే సీఆర్పీని కానీ లేదంటే టీచర్‌ను అడ్జెస్ట్‌ మెంట్‌ చేస్తాం.

– పార్శి అశోక్‌, డీఈవో

కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థి జీవితానికి ఎంతో ప్రధానమైనది ప్రాథమిక విద్య. అక్షరాలు రాయడం, చదవడం, గణిత నైపుణ్యాలు, అర్థం చేసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది. ఒకే ఉపాధ్యాయుడితో ఐదు తరగతులను నిర్వహించడంతో విద్యార్థిపై వ్యక్తిగత దృష్టి పెట్టడం సాధ్యం కాదు. దీంతో విద్యార్థుల్లో అభ్యసన లోపాలు పెరిగి ఉన్నత తరగతుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement