కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని భారత్ క్రికెట్ క్లబ్ యూత్ ఫెడరేషన్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జరిగిన ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా చిటిమెల్లి ప్రేమ్‌కుమార్, గోనెల జగన్నాథం, అధ్యక్షుడిగా పార్లపల్లి ప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక ప్రసాద్, ఉప కార్యదర్శిగా తోట ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా వెంకటరాజం, సలహాదారులను ఎన్నుకున్నారు.
కామారెడ్డి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు సెప్టెంబర్ 9 వరకు గడువు పొడిగించినట్టు కామారెడ్డి అధ్యయన కేంద్రం సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్ సమాన పరీక్ష, పీజీ ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని సూచించారు.
తాడ్వాయి: మండలంలోని పల్లెగడ్డా తండా శివారులో నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వివరాలిలా ఉన్నాయి. గత 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రుక్మాయి అనే గ్రామం ఉండేదని, ఆ గ్రామ సమీపంలో ఉన్న గడి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తరచూ తవ్వకాలు జరుగుతుండేవని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆ గడి స్థలానికి సంబంధించి భూవివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. భూవివాదం విషయంలో ఎవరో కావాలనే క్షుద్ర పూజలు చేశారా.. లేదా భయపెట్టడానికి చేసి ఉంటారా అని తండావాసులు చర్చించుకుంటున్నారు. పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


