కిక్కిరిసిన మేకల సంత | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన మేకల సంత

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

రూ.4.5 కోట్ల లావాదేవీలు

విక్రయదారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న మేకల సంత

నవీపేట: ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నవీపేట మేకల సంత విక్రయదారులు, కొనుగోలుదారులతో శనివారం కిటకిటలాడింది. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున బోనాల పండుగ నిర్వహించనుండడంతోపాటు వన భోజనాలకు వెళ్లనున్న నేపథ్యంలో జీవాల కొనుగోలుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలో ఎక్క డ చూసినా వాహనాలు పార్కింగ్‌ చేసి కనిపించాయి. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు శుక్రవారం సా యంత్రమే తమ వాహనాల్లో జీవాలను తీసుకు ని వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆదివారానికి ప్రత్యేకత ఉండడంతో ఇరు రాష్ట్రాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు సంతలో క్ర యవిక్రయాలు జరిపారు. సంత ప్రాంగణం సరిపోకపోవడంతో బాసర రహదారి పక్కన, బ స్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో క్రయవిక్రయాలు కొ నసాగాయి. ఈ శనివారం రూ.4.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement