11న దివ్యాంగుల జిల్లా స్థాయి సదస్సు | - | Sakshi
Sakshi News home page

11న దివ్యాంగుల జిల్లా స్థాయి సదస్సు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

11న దివ్యాంగుల జిల్లా స్థాయి సదస్సు

బోధన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో విఫలమవుతున్న నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం అంశాల పై చర్చించేందుకు ఈ నెల 11న రాకాసీపేటలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్‌ తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలో ఆయన వేదిక ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న నెలసరి రూ.300 పెన్షన్‌ను రూ.5 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4016 నుంచి రూ.6016కు పెంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. వేదిక ప్రతినిధులు జల్లాపురం సాయిలు, గిర్ని రాజు, మంచిప్ప మోహన్‌, తబ్రీజ్‌, సాయిలు, పావని, సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement