యూరియా కోసం బారులు తీరిన రైతులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం బారులు తీరిన రైతులు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణంలో యూరి యా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే ఫర్టిలైజర్‌ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్‌ షాప్‌ వద్దకు అధిక సంఖ్యలో రైతులు చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. తొక్కిసలాట వాతావరణం నెలకొంది. యూరియా పంపిణీలో భాగంగా బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తుండగా, నెట్‌వర్క్‌ సమస్యలు రైతుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. నాలుగు బస్తాల యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement