వేల్పూర్(బాల్కొండ): గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. బాల్కొండ, మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో శనివారం నిర్వహించిన ప్రత్యేక హెల్త్ మేళాను డీఎంహెచ్‌వో పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వైద్యులు, సిబ్బంది నిర్వహిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. గర్భిణులతో స్వయంగా మాట్లాడారు. వైద్యురాలు సవిత, సీ్త్రల వైద్య నిపుణులు స్వాతి, సబ్ యూనిట్ అధికారి సాయి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
వేల్పూర్: స్కూళ్ల సమస్యలను సమష్టి కృషితో పరిష్కరించుకుందామని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లక్కోర వద్ద శనివారం నిర్వహించిన సాధారణ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బడ్జెట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే విధానాలపై ఐక్యంగా ఉండాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ, జిల్లా కార్యదర్శి రవీందర్, జిల్లా ట్రెజరర్ హరీశ్, గిరి పాల్గొన్నారు.
నవీపేట: ఆలిండియా డినేటిఫైడ్ ట్రైబ్స్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాదవ్ శరత్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆలిండియా డినేటిఫైడ్ కౌన్సిల్ బోర్డు జాతీయ అధ్యక్షుడు బికు రామ్ ఇదాతే, ప్రధాన కార్యదర్శి అనిల్ పహాడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు స్వర్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చిరంజీవి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాదవ్ శరత్‌ను ఎన్నికయ్యారు. జాదవ్ శరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అణగారిన సంచార జాతుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసే అవకాశం ఇచ్చిన జాతీయ, రాష్ట్ర కమిటీలకు ధన్యవాదాలు తెలిపారు.


