పక్కాగా సమాచారం సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

పక్కాగా సమాచారం సేకరించాలి

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ సమాచార సేకరణపై వీసీ ద్వారా సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ రూపకల్పనకు ఫీల్డ్‌ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో సమాచారాన్ని పక్కాగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. జనగణన 2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ రూపకల్పన విషయమై ఆమె శుక్రవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ రూపొందించేందుకు విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌, రుణ సదుపాయాలు, విద్యుత్‌, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, తయారీ చేతివత్తులు, గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేక అంశాలు, పరిశీలనలు వంటి తొమ్మిది ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేలా చూడాలన్నారు. అదేవిధంగా టౌన్‌ డైరెక్టరీ షెడ్యూల్‌ ను ఛార్జ్‌ ఆఫీసర్లచే (మున్సిపల్‌ కమిషనర్‌) నియమించబడిన అధికారుల ద్వారా పట్టణ పౌర, పరిశ్రమలు, సామాజిక సదుపాయాలు, మురికివాడలకు సంబంధించిన స మాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఆ యా శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి ఛార్జ్‌ ఆఫీసర్లకు అందించాలని ఆదేశించారు. సమాచార సేకరణ ప్రక్రియ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించనున్నట్లు భా రతి వెల్లడించారు. వీసీలో ఇన్‌చార్జి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, అదనపు కలెక్టర్‌ వీ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, సీపీఓ కిషన్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement