అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌ భూపతి రెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ) వీరానంద్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షించారు. నియోజకవర్గంలో చేపట్టిన కొత్త అప్రోచ్‌ రోడ్లు, ఎంఆర్‌ఆర్‌, సీఆర్‌ఆర్‌ రోడ్లు, హ్యామ్‌ రోడ్ల నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వీవో, జీపీ భవనాల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement