ఖలీల్‌వాడి: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ(ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, విద్యారంగం కూడా ఈ సాంకేతిక విప్లవానికి అనుగుణంగా మారుతోంది. అదే దిశగా రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యలో ఏఐ సాంకేతికతను వినియోగించాలన్న ఉద్దేశంతో బోర్డు పలు కొత్త చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నుంచి నూతన కరికులమ్, సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనున్నారు.
ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్‌లో మార్పులు..
ఇంటర్మీడియట్ సబ్జెక్టుల వారీగా మార్పులు, చేర్పులు చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందజేశారు. జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పుస్తకాలను పంపించారు. ఇందులో తెలుగు పుస్తకాన్ని పూర్తిగా మార్చారు. జువాలజీలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించి, ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్ 15 మార్కులు, ఫిజిక్స్‌లో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతోపాటు ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, బాటనీలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్‌లో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతాలను పాఠ్యాంశంలో చేర్చారు. కెమిస్ట్రీలో పదార్థాల స్థితు లు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టాయికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తీసివేశారు. ఫస్ట్ ఇయర్ ప్రాక్టీకల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి 15 లవణాలు పాఠాన్ని కొత్తగా చే ర్చారు. హిస్టరీ యూనిట్–6లో దక్షిణ భారతదేశం, దక్కన్ సామ్రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చి, మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల పాఠాలను తొలగించారు. సుల్తా న్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపా రు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఆర్థికశాస్త్రంలో పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ కలిపారు. అలాగే స్టాటిస్టిక్స్ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు.
ఇంటర్ విద్యలో సంస్కరణలు
మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్లకు ఏఐపై కొనసాగుతున్న శిక్షణ
త్వరలో లెక్చరర్లకు.. తర్వాత విద్యార్థులకు బోధన
ఏఐపై శిక్షణ ఇలా..
ఇంటర్మీడియట్‌లో కొత్తగా ప్రాక్టికల్స్, ఏఐ ద్వారా విద్యార్థులకు విద్యను అందించేందుకు ముందుగా హైదరాబాద్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 17 వరకు మూడు విడుతల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ రీసోర్స్ పర్సన్లకు (డీఆర్పీ) రెండు రోజుల శిక్షణ ఇస్తున్నారు. జిల్లా నుంచి ఇద్దరు లెక్చరర్లు వీటిపై శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు ఏఐ నిర్వచనం, చరిత్ర అ లాగే అప్లికేషన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మధ్య తేడాలు, మ్యాథ్స్‌కు ఏఐ, ప్రోగ్రామింగ్ పునాదులు, తదితర అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు జిల్లాల వారీగా లెక్చరర్లకు ఈనెల 20 తర్వాత శిక్షణ అందించనున్నారు. ఆ తర్వాత వారు విద్యార్థులకు బోధిస్తా రు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి తీసుకువచ్చి నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యా ట్రన్‌పై వివరిస్తారు. ఏఐ బోధన ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో చేరే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
లెక్చరర్లకు రెండు రోజుల శిక్షణ
జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్లకు ఈ నెల 20 తర్వాత సబ్జెక్ట్‌ల వారీగా రెండు రో జుల శిక్షణ అందిస్తాం. తర్వాత విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు బోధించడంతో సులువుగా అర్థమ య్యే అవకాశాలు ఉంటాయి. దీంతో మెరుగైన ఫలితాలు వస్తాయి. జిల్లా నుంచి ఇద్దరు డీఆర్పీలు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
– రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్


