● కొండాపూర్‌లో తెగిన చెరువుకట్ట
పరిశీలన
● శిఖం కబ్జా కారణంగానే ఈ పరిస్థితి
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సిరికొండ: కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయిన ఘటనలో పొలాలు ధ్వంసమై, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. తెగిపోయిన ఊర చెరువు కట్టను, దెబ్బతిన పంటలను, కోతకు గురైన రోడ్లను, కల్వర్టులను ఆయన గురువారం పరిశీలించారు. వరద నష్టం గురించి ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఎమ్మెల్యే ఫోన్‌లో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు శిఖం భూమి కబ్జాకు గురికావడమే కట్ట తెగిపోవడానికి కారణమన్నారు. శిఖం భూములను సర్వే చేసి మార్కింగ్ చేయాలని రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వరద ప్రవాహనికి దెబ్బతిన్న పంటల సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిహారం అందేలా చూస్తామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకులు మునిపల్లి సాయారెడ్డి, బాకారం రవి, ఉమ్మాజీ నరేశ్, నీరటి శ్రీధర్, ఆకుల జగన్, నల్ల బుచ్చన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చందర్‌నాయక్, సర్పంచులు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
వరద ప్రవాహానికి దగ్గరగా వెళ్లొద్దు
వర్షాకాలంలో వరద ప్రవాహం కొనసాగే వాగులు, చెరువులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. మండలంలోని కొండాపూర్ శివారులో తెగిన ఊర చెరువు కట్టను, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను సీపీ గురువారం పరిశీలించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు సంచరించకుండా తగిన హెచ్చరికలు జారీ చేయయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పా టు చేసి పోలీసు పికెట్లను కొనసాగించాలని స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సంబంధిత పోలీసులకు, 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ, ధర్పల్లి ఎస్సైలు, రామకృష్ణ, సందీప్, స ర్పంచ్ నీరటి మానస శ్రీధర్ తదితరులు ఉన్నారు.


