● చెట్ల నరికివేత, కలప రవాణాను
సహించేది లేదు
● అటవీశాఖతో సంయుక్తంగా చర్యలు
● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: అటవీ భూముల ఆక్రమణ అడ్డుకుని వాటి సంరక్షణకు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. అటవీ భూముల ఆక్రమణల నివారణ, సంరక్షణ విధానాలపై అటవీ శాఖ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూ ముల ఆక్రమణలను సమర్థవంతంగా అరికట్టాలని, ఇప్పటికే జరిగిన ఆక్ర మణలను చట్టపరంగా తొలగించాలన్నారు. అట వీ భూముల ఆక్రమణలు ప్రభుత్వ ఆస్తికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించేవని పేర్కొన్నా రు. అటవీ భూముల్లో చెట్ల నరికివేత, అక్రమ మైనింగ్, కలప రవాణా వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్, డ్రోన్ సర్వేల ఆధారంగా ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలు సేకరించాలని, అటవీ శాఖ అధికారులతో సంయుక్తంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బా జీరావు పాటిల్ మాట్లాడుతూ.. అటవీ భూములను రక్షించడం ప్రతి ప్రభుత్వ శాఖతోపాటు ప్ర తి పౌరుడి బాధ్యత అని అన్నారు. అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, కేసుల నమోదు, కోర్టు వ్యవహారాల్లో సమన్వయం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటవీ భూముల ఆక్రమణలను గుర్తించి దశలవారీగా తొలగించాలన్నారు. అక్రమంగా చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్, అట వీ శాఖల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేసి తక్షణ స్పందన వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖరరావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


