● విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు
పంపేందుకు ఐటీపీఎస్
నిజామాబాద్ రూరల్: తోబుట్టుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ (రక్షాబంధన్) పండుగకు తపాలాశాఖ ప్రత్యేక సేవలందిస్తోంది. విదేశాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపించేందుకు ప్రత్యేకంగా ఇండియా పోస్ట్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ఐటీపీఎస్)ను తీసుకొచ్చింది. రాఖీలతోపాటు చిన్న బహుమతులను సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చులతో పంపేందుకు ఐటీపీఎస్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రపంచంలోని 130కిపైగా దేశాలకు రాఖీలను పంపే సౌకర్యం అందుబాటులో ఉండ గా, సురక్షిత ప్యాకింగ్, వేగవంతమైన ఎయిర్ మెయిల్ ర వాణా, ఆన్‌లైన్ ట్రా క్, ట్రేస్ సౌకర్యం, విశ్వసనీయమైన డెలివరీ వంటి ప్ర యోజనాలు ఉన్నా యి. ఐటీపీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కె జనార్దన్‌రెడ్డి కోరారు. సమీప తపాలా కార్యాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు.


