జక్రాన్‌పల్లి: జిల్లాలోని మునిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు భేషుగ్గా ఉన్నాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ రవీందర్ అభినందించారు. జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రా మంలో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. గ్రామంలో పర్యటించి ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్, కంపోస్ట్ షెడ్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్ పిట్‌ను పరిశీలించారు. పనుల నాణ్యత, ని ర్వహణ విధానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాల పరిరక్షణ పను ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ నవెంట సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్య క్షుడు, మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయ న్న, డీపీవో శ్రీనివాసరావు, డీఎల్‌పీవో శివకృష్ణ, ఎంపీడీవో సతీశ్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రశాంత్ తదితరులున్నారు.


