ఖలీల్‌వాడి: సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నిధులపై నగరంలోని ఆదర్శ హిందీ విద్యాలయంలో బుధవారం ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కి చెందిన చార్టెడ్ అకౌంటెంట్స్ నిజామాబాద్ దక్షిణ, ఉత్తర మండలాలతోపాటు నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలకు చెందిన దాదాపు 150 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన నిధులు, ఖర్చయిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆడిటర్లు జయప్రకాశ్, ధనుష్, నరేందర్ క్యాష్‌బుక్ వొచర్లను పరిశీలించారు. నాలుగు మండలాల్లో 100 శాతం ఆడిట్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.


