● ఆర్‌ఎం కృష్ణమూర్తి
నిజామాబాద్ రూరల్ : టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఎం కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్లొమా, ఇంజినీరింగ్, జనరల్ డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు https:// nats. education. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు మూడు సంవత్సరాల శిక్షణ కాలంలో నిబంధనల ప్రకా రం స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. శిక్షణ కాలం పూ ర్తి కాగానే సర్టిఫికెట్ ఇస్తామని, 13 డిప్లొమా, 5 జనరల్ డిగ్రీ అప్రెంటిషిప్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్‌ఎం పేర్కొన్నారు.
● డీఏవో వీరాస్వామి
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు సంప్రదాయ పంటలతోపాటు మేకల పెంపకం చేపడితే ఆర్థికంగా అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. జిల్లాలో ధర్పల్లి, సిరికొండ మండలాల్లో అమలవుతున్న ఎంఎంపీటీఎఫ్ కార్యక్రమంలో భాగంగా పలువురు మహిళా రైతులకు బుధవారం జిల్లా పశువైద్య శాఖలో మేకల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఏవో వీరాస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మేకల పెంపకానికి యాజమాన్య పద్ధతులు, పశుగ్రాసం, టీకాలు, షెడ్ల నిర్వహణ, జీవాలకు బీమా, మార్కెటింగ్ అంశాలపై వివరించి చెప్పారు. టెక్నికల్ ఏవో శ్రీనివాస్, పశువైద్యాధికారులు అహ్మద్, డీబీ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామాల వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), జలసిరి ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రావు ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి రైతు వేదికలో డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాలకు చెందిన పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో డీపీవో మాట్లాడారు. జలసిరి ప్రోగ్రాం కింద పామ్‌పాండ్స్, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జి స్ట్రక్చర్స్, కమ్యూనిటీ సోప్ కిట్స్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. డీఎల్‌పీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు ఉదయ్‌భాస్కర్, ఆరేటి అనంత్‌రావు, డిచ్‌పల్లి ఎంపీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ శ్రీధర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గణేశ్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


