ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం

Aug 6 2026 7:50 AM | Updated on Aug 6 2026 7:50 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నా రు. పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలోని నవదుర్గ ఆలయంలో టీఎన్జీవోఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మహేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులు సమాజ సేవ తోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలూ నిర్వహించడం అభినందనీయమన్నారు. అర్బన్‌ ఎమ్మె ల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగ నిర్వహించడం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. అ దనపు కలెక్టర్‌ భుజంగరావు మాట్లాడుతూ ఉ ద్యోగులు తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అంతకుముందు పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలోని నవదుర్గ మాత ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌, మేయర్‌ ఉమారాణి, టీఎన్జీవోఎస్‌ జిల్లా అధ్యక్షుడు సుమన్‌, మహిళా ఉ ద్యోగులు బోనాలను ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహా అ న్నదానం చేశారు. మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, టీఎన్జీవోస్‌ నాయకులు గైని గంగారాం, శ్రీనివాస్‌, మారుతి, పెద్దోళ్ల నాగరాజు, డీఎంహెచ్‌వో రాజ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు

మహేశ్‌కుమార్‌గౌడ్‌

టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో

ఘనంగా బోనాల పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement