● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ కులాచారి
● ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ను
సస్పెండ్ చేయాలని ధర్నా
రెంజల్: విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పా ల్పడిన రెంజల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఫిరోజ్ హైదర్‌ను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వెనుకేసుకురావడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వెంటనే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని బుధవారం రెంజల్ ఆదర్శ పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దినేశ్ కు లాచారి మాట్లాడుతూ ప్రిన్సిపల్ అక్రమాలకు పా ల్పడినట్లు రుజువైనా చర్యలు తీసుకోకుండా, సంబంధం లేని కంప్యూటర్ ఆపరేటర్‌ను తొలగించి మూడు రోజులకే మళ్లీ విధుల్లోకి తీసుకోవడం వెను క కారణాలను ప్రశ్నించారు. ధర్నాలో నీలా, ఎడపల్లి సర్పంచులు క్యాతం యోగేశ్, కందగట్ల రాంచందర్ నాయకులు పాల్గొన్నారు.
సీపీని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
నిజామాబాద్ అర్బన్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేశ్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను కలిశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకున్నారని సీపీకి వివరించారు.


