వినూత్న పద్ధతులతో ఆదాయం పొందాలి | - | Sakshi
Sakshi News home page

వినూత్న పద్ధతులతో ఆదాయం పొందాలి

Aug 6 2026 7:50 AM | Updated on Aug 6 2026 7:50 AM

డీఆర్డీవో సాయన్న

వేల్పూర్‌(బాల్కొండ): వినూత్న పద్ధతులు అవలంబిస్తూ రైతులు అధిక ఆదాయం పొందాలని డీఆర్డీవో సాయన్న సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలో ఏడాది క్రితం ఉపాధిహామీ పథకంలో రైతు నానం నరేశ్‌ ఫాంపాండ్‌ నిర్మించుకొని చేపట్టిన చేపల పెంపకాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. చేపల పెంపకం, ఆదాయం తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ఫాంపాండ్‌ నిర్మించుకుంటే పంట పండే భూమిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారని, నష్టపోయే పంటకు బదులు చేపల పెంపకంతో ఆదాయం పొందవచ్చన్నారు. ఫాంపాండ్‌ను సిరికొండ మండల రైతులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీలు గంగామోహన్‌, ఓంపాల్‌, ప్లాంటేషన్‌ మేనేజర్‌ కపిల్‌, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీవో గంగామోహన్‌, ఏపీవో ఇందిర, సర్పంచ్‌ గాండ్ల రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement