ఎత్తి పోద్దామా..? | - | Sakshi
Sakshi News home page

ఎత్తి పోద్దామా..?

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

వేచి చూద్దామా..
ఎస్సారెస్పీ పునరుజ్జీవంపై తేల్చుకోలేని స్థితిలో అధికార యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఓవైపు గోదావరి నది పై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు మాత్రం అత్తెసరు నీటితో వెలవెలబోతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు ప్రాజెక్టులో 34.81 టీఎంసీలు మాత్రమే చే రింది. ప్రస్తుతం ఎగువ నుంచి 22 వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ స్థాయి నీటిప్రవాహంతో ప్రాజెక్టు పూర్థిస్థాయి నీటినిల్వపై నీలినీడ లు అలుముకున్నాయి. ఇలాంటి కరువు పరిస్థితు ల ను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం అమలుతీరుపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. వరద కాలువ ద్వారా గోదావరి నీటిని తిరిగి ఎస్సారెస్పీకి చేర్చే ఈ ప్రక్రియపై ప్రభు త్వం దృష్టిపెడుతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఎగువ నుంచి మిగు లు జ లాల రాకకోసం మరికొంత కాలం వేచిచూ స్తారా లే క పునరుజ్జీవం ద్వారా ప్రాజెక్టు నింపేందుకు చర్య లు తీసుకుంటారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

రివర్స్‌ పంపింగ్‌పైనే కొనసాగుతున్న చర్చ

ఎస్సారెస్పీ ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేనప్పుడు, దిగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి తిరిగి ఎస్సారెస్పీకి రివర్స్‌ పంపింగ్‌ విధానంలో నీటిని తీసుకురావడమే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఉద్దేశం. ఇందుకోసం ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీకి తరలించేందుకు వీలుగా వరదకాలువ అనుసంధానం చేస్తూ మూడు చోట్ల పంప్‌హౌస్‌, మోటార్లను ఏర్పాటుచేశారు. వరద కాలువలో నీరు నింపేదుకు మూడు చోట్ల పంప్‌హౌస్‌ ఏర్పాటుతోపాటు ఒక్కో మోటారు ద్వారా 1,450 క్యూసెక్కుల నీరు చొప్పున రోజుకు టీఎంసీ చొప్పున రెండు నెలల్లో 60 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలించాలనే ప్రణాళికతో ఈ పథకాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో రెండు రోజులపాటు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీలోకి ఎత్తిపోతలు చేపట్టినా, తర్వాత భారీ వర్షాలు, నీటిలభ్యత కారణంగా నిలిపివేశారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు, గోదావరి ఎగువ నుంచి ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో పెద్దగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి రివర్స్‌ పంపింగ్‌తో ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

55 టీఎంసీలు ఉంటేనే..

ఎస్సారెస్పీలో ప్రస్తుత నీటిమట్టం 1,075 అడుగుల వద్ద కేవలం 34.81 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. తాగునీటి అవసరాలతోపాటు కనీస నిర్వహణ కోసం 55 టీఎంసీలకుపైగా నీరు ఉంటేనే పరిస్థితి ఆశాజనకంగా ఉండనుంది. ఇన్‌ఫ్లో రాకపోతే రివర్స్‌ పంపింగ్‌ పద్ధతిలో ఎస్సారెస్పీ పునరుజ్జీవం మినహా వేరే మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోయినా.. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు వారబందీ పద్ధతిలోనైనా నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎగువ నుంచి ఆశించిన మేర ఇన్‌ఫ్లో రాకపోవడంతో ఎస్సారెస్పీ వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో ‘పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీలోకి నీటిని తీసుకు వస్తారా? లేక ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో కోసం ఎదురు చూస్తారా? అనే చర్చ మొదలైంది. ఆశించిన మేర వరద లేని ప్రస్తుత పరిస్థితుల్లో రివర్స్‌ పంపింగ్‌ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. వేచి చూద్దామా? లేక ఎత్తిపోద్దామా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు.

వరద కాలువ జీరో పాయింట్‌కు చేరిన నీరు

గోదావరి దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండటంతో అక్కడ పంప్‌ల ద్వారా ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్‌హౌస్‌, మల్యా ల మండలం రాంపూర్‌ పంప్‌హౌస్‌, మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ మీదుగా ముప్కాల్‌ జీరోపాయింట్‌ వరకు వరద కాలువలో నీటిని నిల్వ చేసి ఉంచారు. కాలువలో 4.5 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉంది. కాల్వపై ఆధారపడిన రైతులతోపాటు భూ గర్భజలాల పెంపునకు ఉపయోగపడేలా ప్రస్తు తం నీటిని నిల్వ చేశామని అధికారులు చెబు తున్నారు. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీలోనికి నీటిని ఎత్తిపోతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

వరదకాలువలో నీటి నిల్వకే పరిమితం

ప్రభుత్వ నిర్ణయంపైనే ఆయకట్టు

భవితవ్యం

ఇలాంటి పరిస్థితుల్లోనే పునరుజ్జీవం

అవసరమనే చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement