పక్కాగా విలేజ్‌ ప్రొఫైల్‌ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా విలేజ్‌ ప్రొఫైల్‌

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. రాబోయే మూడేళ్ల కాలానికి (2026–29) గ్రామాల్లో చేపట్టాల్సిన మౌ లిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన అంశాలతో కూడిన ‘తెలంగాణ గ్రామ పంచా యతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక’ (జీపీసీడీపీ) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీని కోసం జిల్లా లో పంచాయతీల వారీగా పూర్తి వివరాలను సేకరి స్తున్న పంచాయతీ కార్యదర్శులు విలేజ్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి మొ త్తం వందకుపైగా అంశాలను నివేదికలో నమోదు చేస్తున్నా రు. పంచాయతీ పేరు మొదలుకొని ఊరి విస్తీర్ణం, వార్డులు, రేషన్‌కార్డులు, నివాసాలు, కుటుంబా లు, కులాల వారీగా జనాభా, గుడులు, బడులు, రోడ్లు, మహిళా సంఘాలు, రైతులు, అక్షరాస్యత రే టు, కావాల్సిన అభివృద్ధి పనులు తదితర వివరా లు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా రా బోయే రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, తాగునీరు

గ్రామాల్లో మరుగుదొడ్లు అవసరమైన వారిని గుర్తించి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డిని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద రూ.12 వేలతో నిర్మించనున్నారు. అలాగే కమ్యూనిటీ టాయిలెట్ల సముదాయాలను కట్టేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. అదే విధంగా తాగునీటి సరఫరా లేని ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు అంచనాలను సి ద్ధం చేస్తున్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు, పైపులైన్‌ల విస్తరణతోపాటు నల్లా కనెక్షన్‌లు లేని ఇళ్లను గుర్తిస్తున్నారు. పాత చేతి పంపులు, మోటార్ల మరమ్మతుల కోసం అవసరమైన అంచనాలను నివేదికలో చేరుస్తున్నారు. అలాగే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామాల మధ్య లింక్‌ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తున్నారు. గ్రామాలు శుభ్రంగా కనిపించేలా డ్రెయినేజీల నిర్మాణం, వీధు ల్లో ఎల్‌ఈడీ విద్యుత్‌ లైట్లు అవసరాలను గుర్తిస్తున్నారు. కాగా, ఉపాధిహామీలో వన మహోత్సవం కింద అవెన్యూ ప్లాంటేషన్‌, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహి ళా సంఘాలు, వారు తీసుకున్న రుణాలతో స్థాపించిన వ్యాపారాలను నివేదికలో పొందుపరుస్తున్నా రు. గ్రామ సమగ్ర సమాచారం ప్రతీ పౌరుడు సులభంగా తెలుసుకునేలా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన యాప్‌ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.

పల్లెల ప్రగతికి ఇదే దిక్సూచి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో మూడేళ్ల అభివృద్ధి ప్రణాళిక కోసం వివరాల సేకరణ వే గంగా జరుగుతోంది. ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. ఇతర శా ఖల ఉద్యోగులు, సర్పంచుల సహకారంతో దీనిని ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని చెప్పాం. ఈ నివేదిక పల్లెల ప్రగతికి దిక్సూచిలా పని చేస్తుంది.

– శ్రీనివాస్‌ రావు, జిల్లా పంచాయతీ అధికారి

సిద్ధమవుతున్న మూడేళ్ల సమగ్ర

అభివృద్ధి ప్రణాళిక

వందకుపైగా అంశాలపై వివరాలు

సేకరిస్తున్న కార్యదర్శులు

గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చేందుకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement