ఫామ్‌ తిరిగివ్వరేమి..!? | - | Sakshi
Sakshi News home page

ఫామ్‌ తిరిగివ్వరేమి..!?

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించినా అర్బన్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రం ప్రక్రియ వెనుకబడి ఉంది. అర్బన్‌లో ఇప్పటికీ సుమారు 60వేల ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు బీఎల్‌వోల చేతికి అందలేదు. ఓటర్ల నిర్లక్ష్యమా..? అవగాహనా రాహిత్యామా? ప్రచార లోపమా? కారణమేదైనా మొత్తానికి ‘సర్‌’ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు తొలగించనున్న ఓట్లను గుర్తించారు. ఈనెల 4వ తేదీ వరకు 1,36,809 ఓట్లను గుర్తించారు. ఇందులో మరణించిన వారి ఓట్లు 32,858 ఉండగా, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు 60,689 మంది ఉన్నారు. అలాగే డబుల్‌ ఓట్లు 43,262 ఉన్నాయి. అయితే సర్‌ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగనుండగా తొలగిపోనున్న ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

జిల్లా వ్యాప్తంగా 14,39,734 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 12,22,754 (84.93 శాతం) ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల డిజిటలైజేషన్‌ పూర్తయ్యింది. అర్బన్‌ నియోజకవర్గంలో 3,08,261 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2,20,217 ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను (71.44 శాతం) డిజిటలైజ్‌ చేశారు. బోధన్‌ నియోజకవర్గంలో 2,23,152 ఓటర్లు ఉండగా 1,95,134 (87.44 శాతం) ఫామ్‌లు, ఆర్మూర్‌ నియోజక వర్గంలో 2,15,186 ఓటర్లకుగాను 1,89,451 (88.04 శాతం) ఫామ్‌లు డిజిటలైజ్‌ అయ్యాయి. నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గంలో 2,64,723 ఓటర్లు ఉండగా.. 2,33,314 మంది ఓటర్ల (88.14 శాతం) ఫామ్‌లు, బాల్కొండ నియోజక వర్గంలో 2,32,081 ఓటర్లకుగాను 2,08,256 (89.73 శాతం) ఫామ్‌ల డిజిటలైజేషన్‌ పూర్తయ్యింది. బాన్సువాడ నియోజకవర్గంలో 1,96,331 మంది ఓటర్లు ఉండగా, 1,76,382 (89.84శాతం) ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను డిజిటలైజ్‌ చేశారు.

నియోజక వర్గం మృతులు వలస వెళ్లిన వారు డబుల్‌ ఓటర్లు

ని.అర్బన్‌ 4,611 6,402 9,710

ని.రూరల్‌ 6,892 13,436 8,846

ఆర్మూర్‌ 6,185 9,931 7,908

బోధన్‌ 5,345 12,099 4,776

బాల్కొండ 5,877 9,278 6,991

బాన్సువాడ 3,948 9,543 5,031

మొత్తం 32,858 60,689 43,262

తొలగిపోనున్న ఓట్లు

అర్బన్‌లో బీఎల్‌వోల చేతికందని ఎన్యు మరేషన్‌ ఫామ్‌లు సుమారు 60 వేలు..

జిల్లాలో తొలగిపోనున్న

మొత్తం ఓట్లు 1,36,809

కొనసాగుతున్న సర్‌ ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement