నిజామాబాద్ అర్బన్: రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ అవకతవకల నేపథ్యంలో నమోదైన కేసులపై సీపీ సాయిచైతన్య మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, వాటి పురోగతి వివరాలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. సివిల్ సప్లయీస్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ వీసాలు ఇచ్చిన వ్యక్తి అరెస్ట్
● నాలుగేళ్లుగా తప్పించుకు
తిరుగుతున్న నిందితుడు
నిజామాబాద్ అర్బన్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు ఇచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై యాదగిరి తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌లోని శాలిబండకు చెందిన ఎంఏ ఖయ్యూమ్ 2022లో నిజామాబాద్ నగరానికి చెందిన 15 మందిని ఖఽతర్‌కు పంపిస్తానని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ నకిలీ వీసాలు ఇచ్చి పారిపోయాడు. అప్పట్లోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఖయ్యూమ్ నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. నిందితుడిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిజామాబాద్ బస్టాండ్‌ను ఆధునికీకరించండి
సుభాష్‌నగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ను ఆధునీకరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంగళవారం ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి మంత్రికి ధన్‌పా ల్ వినతిపత్రం అందజేశారు. కొత్త బస్టాండ్‌ను నిర్మించే వరకూ ప్రస్తుత బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చాలని, ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ బస్‌డిపో కోసం..
ఆర్మూర్: పట్టణంలో నూతన ఇంటిగ్రేటెడ్ బస్ డిపో, అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లో టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఎలక్ట్రిక్ బస్సులు అన్ని రూట్‌లలో సరిపడా నడపాలని, నందిపేట బస్ డిపోను మంజూరు చేసి, మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎండీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.


