కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

వేల్పూర్‌(మెండోరా): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద.. మంగళవారం మధ్యాహ్ననికి 28,570 క్యూసెక్కులకు పెరిగి.. సాయంత్రం సమయానికి 22,222 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1075 అడుగుల(34.817 టీఎంసీలు) నీరు నిల్వఉంది. కాకతీయ కాలువ ద్వారా 330, మిషన్‌ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 403 కూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మంగళవారం 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. పోచారం ప్రాజెక్టు అలుగు ద్వారా 8 వేల క్యూసెక్కులు, మెదక్‌ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట ద్వారా 2 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,398 అడుగుల (9.5 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

ఎల్లారెడ్డి: కల్యాణి ప్రాజెక్టులోకి వంద క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు మంగళవారం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి అంతే నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 అడుగులు కాగా.. మంగళవారం సాయంత్రానికి 408 అడుగుల నీరు నిల్వ ఉంది.

నిజాంసాగర్‌లోకి..

కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement