డొంకేశ్వర్(ఆర్మూర్): మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలలో డెంగీ, సీజన్ వ్యాధులపై వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి సికిందర్ హాజరై సీజనల్ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. హెచ్‌ఎం సురేశ్‌కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి గోవర్ధన్, మెడికల్ ఆఫీసర్ శరత్ చంద్ర, సూపర్‌వైజర్లు సురేంధర్, సునీత ఉన్నారు.


