రాష్ట్రస్థాయి చౌక్‌బాల్‌ టోర్నీలో జిల్లా జట్టు ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి చౌక్‌బాల్‌ టోర్నీలో జిల్లా జట్టు ప్రతిభ

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

రాష్ట్రస్థాయి చౌక్‌బాల్‌ టోర్నీలో జిల్లా జట్టు ప్రతిభ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై శిక్షణ పొక్లెయిన్‌ ఢీకొని రైల్వేగేట్‌ ధ్వంసం

కమ్మర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఇటీవల నిర్వహించిన జూనియర్‌ చౌక్‌ బాల్‌ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో నిజామాబాద్‌ జిల్లా జట్టు రెండో స్థానంలో నిలిచింది. జిల్లా జట్టు తరపున కమ్మర్‌పల్లిలోని మిసిమి హైస్కూల్‌ జట్టు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి 2వ స్థానం కై వసం చేసుకున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్‌ బాలి రవీంధర్‌, వ్యాయామ ఉపాద్యాయుడు సంజీవ్‌ సోమవారం తెలిపారు. ఫైనల్‌ మ్యాచ్‌లో రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా జట్లు తలపడగా, రంగారెడ్డి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్‌ జట్టుగా నిజామాబాద్‌ నిలిచినట్లు తెలిపారు. ఈసందర్భంగా జట్టు సభ్యులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

బోధన్‌: కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎల్‌( ఫ్రేం వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌) యాప్‌పై సోమవారం పట్టణంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బోధన్‌, సాలూర మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఎరువుల దుకాణాల డీలర్లకు హాజరుకాగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రస్థాయి అధికారులు ఈ యాప్‌ ద్వారా ఎరువులను బు క్‌ చేసుకునే విధానం, డీలర్ల లాగిన్‌, స్లాట్‌ న మోదు, ఎరువుల పంపిణీ విధానం, రైతుల బు కింగ్‌ల ధ్రువీకరణ, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బోధన్‌ ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఏవో శ్వేత, ఏఈవోలు, ఎరువుల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.

నిలిచిన వాహనాల రాకపోకలు

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని గాంధీ పార్కు వద్ద గల రైల్వే గేట్‌ను సోమవారం పొక్లెయిన్‌ ఢీకొనడంతో ధ్వంసమైంది. దీంతో గేట్‌ పనిచేయకపోవడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అదే సమయంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తుండడంతో రైల్వే సిబ్బంది గేటును వేయడానికి ప్రయత్నించినా ఎంతకు గేటు పడక పోవడంతో, ట్రాఫిక్‌ పోలీసులు, తాడును కట్టి ట్రాఫిక్‌ను నియంత్రించారు. అప్పటికే రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో వాహనదారులు ఎక్కువ సమయం అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement