క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

అంత్యక్రియలకు వచ్చి అనంత లోకాలకు.. డ్రంకన్‌డ్రైవ్‌లో పలువురికి జరిమానా

రైతును బలిగొన్న విద్యుత్‌ ఫెన్సింగ్‌

సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి): పంటను కాపాడుకుందామని వేసుకున్న విద్యుత్‌ తీగలే ఆ రైతు ప్రాణాలను బలిగొన్నాయి. మండలంలోని కుప్రియాల్‌ గ్రామంలో సోమవారం విద్యుత్‌ షాక్‌కు గురై ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్‌ తెలిపారు. వివరాలు ఇలా.. కుప్రియాల్‌ గ్రామానికి చెందిన పెనుగొండ ఎల్లయ్య (55) అనే రైతు తన పొలంలో చెరకు పంటను సాగు చేస్తున్నాడు. పంటను అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్‌ ఫెన్సింగ్‌ వైర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్రమంలో అకస్మాత్తుగా ఆ ఫెన్సింగ్‌ వైర్లకు విద్యుత్‌ సరఫరా కావడంతో, ప్రమాదవశాత్తు వాటిని తాకిన ఎల్లయ్య విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

యాచారంలో ట్రాక్టర్‌ ఢీకొని బాలుడి మృతి

సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి): బంధువుల అంత్యక్రియలకు వచ్చి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని యాచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పుష్పరాజ్‌ తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన సంగం అజిత్‌ (9) అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి సోమవా రం యాచారంలో జరిగిన ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈక్రమంలో బాలుడు బయట ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్‌ అజిత్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు ని ర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డా రు. సోమవారం నాలుగురిని ఆర్మూర్‌ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి నాలుగు రోజుల పా టు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. అలాగే డీసీఎం వ్యాను రోడ్డుపై పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డ్రైవర్‌కు రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement