తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి కోరారు. బీసీ స్టడీ సర్కిల్–నిజామాబాద్ ద్వా రా కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగుల నుంచి ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తెలిపారు. ఈసందర్భంగా సోమవారం తెయూలో సంబంధిత పోస్టర్ల ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), పోలీస్ నియామక పరీక్షలు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రవేశాలకు ఉచిత కోచింగ్‌కు ఆగస్ట్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


