ఖలీల్‌వాడి : పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 219, బాసర జోన్‌లో మరో 24 కానిస్టేబుల్, 36 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. పోలీసు ఉద్యోగ ప్రకటనతో పోటీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు యువతీ, యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
గ్రంథాలయాలు కిటకిట..
జిల్లాలోని గ్రంథాలయాలు ఉద్యోగార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఖలీల్‌వాడీలోని జిల్లా గ్రంథాలయం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులతో సందడిగా మారుతోంది. నిర్వాహకులు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ గ్రంథాలయానికి ప్రతి రోజు 400 మంది అభ్యర్థులు వస్తుంటారు. సాధారణంగా ప్రతి శుక్రవారం గ్రంథాలయానికి సెలవు ఉండగా, అభ్యర్థుల కోసం ఆ రోజున ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని అందుబాటులో ఉంచి లైబ్రరీని తెరిచి ఉంచుతున్నారు. అభ్యర్థుల సంఖ్య పెరిగితే ఓల్డ్ డీఈవో కార్యాలయం, రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయితే గ్రంథాలయాలకు అభ్యర్థుల తాకిడి ఎక్కువవుతుందని సిబ్బంది చెబుతున్నారు. నగరంలోని బాపూజీ వచనాలయంలో సైతం సుమారు 100 మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వీటితోపాటు జిల్లా కేంద్రంలోని మూడు ప్రయివేటు స్టడీ హాళ్లలో సుమారు 200 మంది అభ్యర్థులు ఉద్యోగ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
బాసర జోన్‌లో ఎస్సై పోస్టులు
ఏడు నెలలుగా ప్రిపేర్ అవుతున్నా..
జిల్లా గ్రంథాలయంలో ఏడు నెలలుగా ఎస్సై పో టీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వర కు గ్రంథాలయంలోనే చదువుతా. తోటి అభ్యర్థులను చూస్తే చదవాలన్న కసి పెరుగుతుంది. సబ్జెక్టుపై అభ్యర్థులందరం కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నాం. – అనిల్, ధర్పల్లి
గ్రంథాలయంలోనే..
జిల్లా గ్రంథాలయంలో ఏడాదిగా చదువుతున్నా ను. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇక్కడికి వచ్చే అభ్యర్థుల సలహా తీసుకొని ప్రిపేర్ అవుతు న్నా. ఇక్కడ ఉంటే చదవాలని, పోలీస్ ఉద్యో గం సాధించాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. – నరేందర్, ఇందల్వాయి
పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువతీ యువకులు
గ్రంథాలయాల్లో పెరిగిన సందడి
జిల్లా పరిధిలో 219, బాసర జోన్‌లో
24 కానిస్టేబుల్ పోస్టులు..
36 ఎస్సై ఉద్యోగాలకు ఈ నెల 19
నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం


