సీ్త్రనిధి రుణాలపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి రుణాలపై ఫోకస్‌

Aug 4 2026 1:47 AM | Updated on Aug 4 2026 1:47 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో సీ్త్రనిధి రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయడంపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న టార్గెట్‌ను చేరుకోవడమే లక్ష్యంగా ఉన్నతాధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల నుంచి రుణాల రికవరీతోపాటు కొత్త రుణాల మంజూరు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ భుజంగరావు సీ్త్రనిధిపై అధికారులతో సమీక్ష నిర్వహించగా నెమ్మదించిన రుణాల మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో రుణాల పంపిణీలో వెనుకబడిన మండలాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నందిపేట్‌, బాల్కొండ, భీమ్‌గల్‌, చందూర్‌, వర్ని, మోస్రా, రెంజల్‌, రుద్రూర్‌, బోధన్‌, మోర్తాడ్‌, సిరికొండ, డిచ్‌పల్లి, కోటగిరి మండలాలు వెనుకబడ్డాయి. ఈ మండలాల్లో ప్రగతిని మెరుగుపరిచేందుకు ఏపీఎంలతో ప్రతీరోజు డీఆర్డీవో సమీక్షలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి మండలంలో 30 శాతానికి పైగా రుణాల పంపిణీని ఎలాగైనా పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో డబ్బులు అవసరమైన మహిళా సంఘాల సభ్యులను గుర్తించి రుణాలు ఇచ్చేందుకు సీసీలు క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. రుణాలివ్వడమే కాకుండా రికవరీ కూడా ప్రస్తుతం 77.42 శాతం ఉండగా, 85 శాతానికి పెరగాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

జిల్లా రుణ లక్ష్యం రూ.285.50 కోట్లు

ఇప్పటి వరకు ఇచ్చింది రూ.52.53 కోట్లు (18శాతం)

రుణాలు పొందిన మహిళా సభ్యులు 5,468

ఇంకా ఇవ్వాల్సిన రుణాలు రూ.232.97 కోట్లు

లక్ష్యాలు చేరుకోవాల్సిందే

నిర్దేశిత లక్ష్యాల మేరకు మహిళా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు పంపిణీ చేయాలి. రికవరీ శాతం కూడా పెరగాలి. ఇప్పటికే ఈ రెండు విషయాల్లో చాలా మండలాలు వెనుకబడినట్లు గుర్తించాం. సిబ్బంది మరింత కృషి చేసి ప్రగతి చూపకపోతే శాఖాప రంగా చర్యలు తప్పవు. – సాయన్న, డీఆర్డీవో

లక్ష్యసాధన కోసం అధికారుల ప్రణాళిక

వెనుకబడిన మండలాలపై

డీఆర్డీవో రోజువారీ సమీక్ష

నెలాఖరు నాటికి 30 శాతానికి పైగా రుణాలివ్వాలని గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement