ఆర్మూర్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఇటీవల జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన రణభేరిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి చేసిన వ్యా ఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపాయి. ఎ మ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్ నేతలు.. ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి హెచ్చరికకు స్పందించిన ఎమ్మెల్యే తా ను యుద్ధానికి సిద్ధమని, అంకాపూర్ వేదికగా తన కు సమఉజ్జీ అయిన కాంగ్రెస్ నాయకుడు చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీఎన్‌ఎస్ 163 సెక్షన్‌ను అమలు చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆర్మూర్, నందిపేట, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్ మండలాల్లో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని ఊహించిన పోలీసులు.. ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డిని అంకాపూర్‌లోని తన నివాసంలో, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డిని ఆర్మూర్‌లో గృహనిర్బంధం చేశారు. రాకేశ్‌రెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు వివిధ మార్గాల ద్వారా పలువురు కాంగ్రెస్ నాయకులు అంకాపూర్‌లోని ఎమ్మెల్యే ఇంటి సమీపానికి చేరుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే నిరసన తెలిపిన వినయ్‌రెడ్డి.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందస్తు వ్యూహంతో పరిస్థితి అదుపులో ఉంది.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
ఆయా చోట్ల నాయకుల
ముందస్తు అరెస్టు
అంకాపూర్‌లో ఎమ్మెల్యే పైడి..
పెర్కిట్‌లో కాంగ్రెస్ ఇన్‌చార్జి
వినయ్‌రెడ్డి గృహనిర్బంధం
బీఎన్‌ఎస్ 163 అమలు చేసిన పోలీసులు


