ఎడపల్లి మండలం జంలం శివారులో బీటలు వారిన మడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాపై ‘ఎల్‌నినో’ పడగ విప్పుతోంది. జూలై మాసం పూర్తి కావొస్తు న్నా వర్షాల జాడ లేకపోవడంతో మెల్లిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు వేగంగా పడిపోవడంతో వ్యవసాయ బోర్లు నీరందక ఎత్తిపోతున్నాయి. జిల్లాలోని డొంకేశ్వర్ వంటి పలు మండలాలు, గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తోంది. వరినాట్లు నెమ్మదించా యి. ఇప్పటికే గుండె నిబ్బరం చేసుకొని నాట్లు వేసి న పంట పొలాలకు నీరందక ఎండుముఖం పడుతున్నాయి. నీటి తడి లేక సాగు భూములు నెర్రెలు బారుతుండడంతో రైతుల్లో దిగులు మొదలైంది. దీంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే సాగు సంకటంలో పడింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2.27లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా, ఇది గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. వర్షాల కోసం వేచి చూసే పరిస్థితి లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చేతిలో పైసలు లేకపోయినా అప్పులు తెచ్చి పొలాల్లో కొత్త బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్క నీరు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒకచోట ఫెయిల్ అయితే మరోచోట బోరు వేస్తూ వేల రూపాయలు మట్టిలో పోస్తున్నారు. ఇంత చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ఎండిపోతున్న పొలాలను రైతులు అలాగే వదిలేయడానికి సిద్ధమవుతున్నారు. పలుచోట్ల నాట్లు వేయకుండా భూములను పడావుగా ఉంచుతున్నారు.
నీరందక వాడుతున్న మక్క
జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటలు(ఎకరాల్లో..)
జిల్లాపై ఎల్‌నినో ప్రభావం
అడుగంటిన భూగర్భ జలాలు
వట్టిపోతున్న బోరుబావులు
నెర్రెలు బారుతున్న భూములు
సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు
రైతులు కొత్త బోర్లు వేస్తున్నా
ఫలితం శూన్యం


