నిజామాబాద్ రూరల్ : జై జగన్నాథ్.. జయహో జగన్నాథ నినాదాలతో ఇందూరు పురవీధులు మార్మోగాయి. నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో జగన్నాథ స్వామి రథ యాత్ర వైభవంగా నిర్వహించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, బలరామకృష్ణుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన ర థాలపై ఊరేగించారు. వేలాది మంది భక్తులు జై జగన్నాథ్ నినాదాలతో రథాలను లాగుతూ స్వా మివారిని దర్శించుకున్నారు. నగరంలోని గంజ్ కమాన్ వద్ద రథయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఇస్కాన్ చేపడుతున్న కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతుందన్నారు. తొ మ్మిది సంవత్సరాలుగా నిజామాబాద్ ఇస్కాన్ నగరంలో రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ ఇస్కాన్ అధ్యక్షుడు సిద్ధ బలరామయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇందూరులో వైభవంగా రథయాత్ర
ఇస్కాన్ కార్యక్రమాలతో
హిందువుల్లో ఐక్యత
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ


