● విద్యార్థుల జీవితాలతో సీఎం
రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతున్నారు
● వైఎస్‌ఆర్ మహానుభావుడు
● నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలోచన ఇందూరు నుంచే మొదలైందని, పథకం బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే అదే గడ్డ నుంచి రణభేరి మొదలవుతుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి హె చ్చరించారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బ కాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకుముందు ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సారథ్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీఎస్ మెదడులో నుంచి పుట్టిన ఆలోచన అని, వైఎస్‌ను ఒప్పించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ, రైతాంగానికి ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. బకాయిలు చెల్లించేందుకు 40 శాతం కమీషన్ అడగటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో కమీషన్ల సర్కారు కొనసాగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. అధికారంలోకి వస్తే బాలికలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఇవ్వలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల షోరూమ్‌లు ఎక్కడ ఉన్నా స్కూటీలు ఎత్తుకెళ్లాలని బాలికలు, యువతులకు పిలుపునిచ్చారు. అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి 40 శాతం కమీషన్ అడగటంపై అక్కడ ఏర్పా టు చేసిన డబ్బాల్లో విద్యార్థులు డమ్మీ నోట్లను వేసి నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, రా ష్ట్ర, నాయకులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు.


